Hyderabad, మార్చి 15 -- Bigg Boss Sivaji About Mangapathi Character: హీరోగా ఎన్నో సినిమాల్లో అలరించిన శివాజీ నటుడిగాను మెప్పించారు. చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో తనదైన పంతాలో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్, 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌లతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.

చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించారు శివాజీ. బిగ్ బాస్ శివాజీ నటించిన లేటెస్ట్ మూవీనే కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీని హీరో నాని సమర్పించాడు. మార్చి 14న థియేటర్లలో విడుదలైన కోర్ట్ సినిమాకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్స్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అలాగే, శివాజీ చేసిన మంగపతి క్యారెక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న శివాజీ...