భారతదేశం, ఏప్రిల్ 1 -- సీరియ‌ల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన బిగ్‌బాస్ తెలుగు ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి సిల్వ‌ర్ స్క్రీన్‌పై బిజీ అవుతోన్నాడు. హీరోగా వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే హీరోగా రెండు సినిమాలు చేస్తోన్న అమ‌ర్‌దీప్ చౌద‌రి తాజాగా మూడో సినిమా మొద‌లుపెట్టాడు. ఈ సినిమాకు సుమ‌తీ శ‌త‌కం అనే టైటిల్ క‌న్ఫామ్ చేశారు. ఇటీవ‌ల ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అమ‌ర్‌దీప్ చౌద‌రికి జోడీగా సైలీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతో ఎం.ఎం నాయుడు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. గ‌తంలో అలా నిన్ను చేరి, సన్నీ లియోన్ మందిర సినిమాలను నిర్మించన‌ కొమ్మాలపాటి సాయి సుధాకర్ సుమ‌తీ శ‌త‌కం సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నారు. త్వరలోనే సుమ‌త...