భారతదేశం, ఏప్రిల్ 22 -- బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రి సుమ‌తీ శ‌త‌కం పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. రొమాంటిక్ ఎంగేజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఇటీవ‌ల అమ‌రావ‌తిలో ప్రారంభ‌మైంది.

ఈ సినిమా ద్వారా ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో బిగ్ అమర్‌దీప్ చౌదరికి జోడీగా సైలీ చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అమరావతిలోని వైకుంఠ‌పురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా సుమ‌తీ శ‌త‌కం మూవీప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టారు. సుమతీ శతకం మూవీకి కథను బండారు నాయుడు అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు.

గ‌తంలో సన్నీ లియోన్ తో 'మందిర'సినిమాను నిర్మించిన‌ కొమ్మాలపాటి సాయి సుధాకర్ సుమ‌తీ శ‌త‌కం సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బిగ్‌బాప్ ఫేమ్ టేస్టీ తేజ ఓ కీల‌క ...