భారతదేశం, డిసెంబర్ 8 -- Bigg Boss 6 Telugu 95 Episode: బిగ్‌బాస్ బుధ‌వారం ఎపిసోడ్‌లో మ‌రోసారి ఏకాభిప్రాయం టాపిక్‌ను తెర‌పైకి తీసుకొచ్చాడు బిగ్‌బాస్‌. ఐదో ఛాలెంజ్‌లో పోటీప‌డ‌టానికి ఇద్ద‌రు ఇంటి స‌భ్యుల పేర్లు ఏకాభిప్రాయంతో చెప్పాల‌ని అన్నాడు. ఆదిరెడ్డి, రోహిత్ పేర్ల‌ను హౌజ్ మేట్స్ ఫైన‌ల్ చేశారు. వీరికి మేజ్ బోర్డ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో ఎవ‌రు గెలుస్తారో చెప్పాల‌ని బిగ్‌బాస్ మిగిలిన కంటెస్టెంట్స్‌ను ఆదేశించాడు. రోహిత్ పేరును శ్రీస‌త్య చెప్ప‌గా మిగిలిన వారంద‌రూ ఆదిరెడ్డి గెలుస్తాడ‌ని అన్నారు. చివ‌ర‌కు ఈ గేమ్‌లో ఆదిరెడ్డి విన్ అయ్యాడు. ఇంటి స‌భ్యులంద‌రి మొత్తం 80 వేల‌ రూపాయ‌ల్ని ప్రైజ్‌మ‌నీలో బిగ్‌బాస్ యాడ్ చేశారు. ఈ టాస్క్‌కు శ్రీహాన్ సంచాల‌క్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ప‌ర‌మాన్నం విష‌యంలో రేవంత్‌, శ్రీహాన్ గొడ‌వ‌ప‌డ్డారు. ప్ర‌తి ద...