భారతదేశం, నవంబర్ 25 -- Bigg Boss 6 Telugu 82 episode: బిగ్‌బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్ ఎంట్రీ ఇస్తూ షోను ఎమోష‌న‌ల్‌గా మార్చేస్తున్నారు. గురువారం బిగ్‌బాస్ హౌజ్‌లోకి శ్రీహాన్ ల‌వ‌ర్ సిరి హ‌నుమంతు వ‌చ్చింది. తొలుత హౌజ్‌మేట్స్ అంద‌రూ ఫ్రీజ్ అంటూ బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత‌ శ్రీహాన్ రిలీజ్ అంటూ వెంట‌నే అనౌన్స్ చేయ‌డంతో శ్రీహాన్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వ‌చ్చార‌ని అనుకున్నారు.

కానీ అలాంటిదేమీ లేదంటూ అత‌డిని కొద్దిసేపు స‌స్పెన్స్‌లో ఉంచాడు బిగ్‌బాస్‌. స‌డెన్‌గా శ్రీహాన్ ల‌వ‌ర్ సిరి హ‌నుమంతు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసి శ్రీహాన్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఏడ్చేశాడు. శ్రీహాన్‌ను ముద్దులు ఇస్తూ మురిపించింది సిరి . ఏడిస్తే ముద్దులు పెట్ట‌డం ఆపేస్తాన‌ని అన్న‌ది. శ్రీహాన్ చూసి చాలా స‌న్న‌బ‌డిపోయావ‌ని, నీ ఫుడ్ మొత్తం శ్రీస‌త్య‌నే తింట...