భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనది. పెళ్లితో రెండు మనసులు దగ్గరవుతాయి, రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి. పెళ్లి అంటే చాలా రకాల తంతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతి ప్రకారం పెళ్లిని జరుపుతూ ఉంటారు. తాళి కట్టడం, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు ఇలా మనం పెళ్లిలో చూస్తూ ఉంటాం. కానీ భూతశుద్ధి వివాహం గురించి మీకు తెలుసా? భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? సమంత ఈ విధానంలోనే పెళ్లి చేసుకున్నారు. అసలు ఈ వివాహ ప్రక్రియ ఎలా ఉంటుంది? అసలు భూతశుద్ధి వివాహం వలన ఏమవుతుంది వంటి విషయాలను తెలుసుకుందాం.

భూత అంటే పంచభూతాలు, శుద్ధి అంటే శుద్ధి చేయడం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలను శుద్ధి చేయడం. దంపతులు శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి మానసిక, భౌతిక బంధాన్ని ఈ వివాహ ప్రక్రియ బలోపేతం చేస్తుందని నమ్ముతారు.

ఇది చాలా పురాతన వివ...