భారతదేశం, ఫిబ్రవరి 24 -- భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రుల స్థాయిలో ఈ మర్డర్‌పై రియాక్ట్ అయ్యారు. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేశారు. భూమి కోసమే ఈ హత్య చేశారని.. ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ కిరణ్‌ ఖరే వెల్లడించారు.

భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌ ముందున్న ఎకరం భూమిపై రాజలింగమూర్తికి, నిందితుల్లో ఏ1గా ఉన్న రేణుకుంట్ల సంజీవ్‌ కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూపై కోర్టుకు కూడా వెళ్లారు. కొంత భూమిని రాజలింగమూర్తి తన పేరిట మోసపూరితంగా రాయించుకున్నాడని, ఆయనను హత్య చేస్తేనే.. భూమి దక్కుతుందని సంజీవ్‌ తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పేవాడు.

ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందటే హత్యకు పథకం రచించాడు సంజీవ్‌. ఇదే విషయాన్ని బీఆర్ఎస్‌...