భారతదేశం, ఫిబ్రవరి 22 -- భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్‌ భర్త రాజలింగమూర్తి హత్య సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. పట్టణంలో మరో విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజలింగమూర్తిని హత్య చేయడానికి నిందితులు గతంలోనే రెండుసార్లు ప్రయత్నించినట్లు తెలిసింది.

భూపాలపల్లి పట్టణంలో ప్రస్తుతం కాలనీలు, రహదారుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో పక్కాగా రెక్కీ నిర్వహించి, సీసీ కెమెరాలు లేని టీబీజీకేఎస్‌ కార్యాలయం సమీపంలోని ప్రాంతాన్ని హత్యకు ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రాజలింగమూర్తిపై గతంలో రాంనగర్‌ కాలనీలో, భూపాలపల్లి పట్ణణంలో కొందరు హత్యాయత్నం చేశారని ఆయన భార్య...