భారతదేశం, ఫిబ్రవరి 21 -- భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రాజలింగమూర్తి సహకరించిన వారే హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. అందుకు కారణం భూ వివాదమని అంటున్నారు. ఈ హత్యలో పాల్గొన్న నలుగురిలో.. ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.

భూవివాదం నేపథ్యంలోనే తన భర్త హత్య జరిగినట్లు రాజలింగమూర్తి భార్య సరళ ఫిర్యాదు చేశారని.. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు వివరించారు. పింగిలి శ్రీమంత్‌, రేణుకుంట్ల సంజీవ్, మోరే కుమార్‌, కొత్తూరు కుమార్, రేణుకుంట్ల కొమరయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే.. హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అదుపులో ఉన్న నిందితుల సెల్‌ ఫోన్లను పోల...