తెలంగాణ,వరంగల్, ఫిబ్రవరి 18 -- తమ భూమిలోకి వెళ్లే బండ్ల బాటను ఓ ఎస్సై దున్ని తన భూమిలో కలుపుకున్నాడని.. అడిగితే అక్రమ కేసులు పెట్టడంతో పాటు మూడేళ్లుగా వ్యవసాయం చేయనివ్వడం లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు వాపోయారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు వృద్ధ దంపతులు ఇద్దరూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాపరెడ్డి దంపతులు. వీరికి అదే గ్రామంలో 12 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి పక్కనే ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులకు భూమి ఉంది. కాగా వృద్ధ దంపత...