తెలంగాణ,వరంగల్, ఫిబ్రవరి 5 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మొగుళ్లపల్లి మండల కేంద్రానికి సమీపంలోని చలివాగులో స్నానానికి వెళ్లిన ఓ స్కూల్ విద్యార్థి వాగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. కాగా బాలుడి మృతికి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన పురాణం సంతోష్ కుమార్ (14) మొగుళ్లపల్లి మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజువారీగా స్కూల్ కు వెళ్లాల్సిన సంతోష్ కుమార్ బుధవారం ఉదయం సమయంలో తన తోటి స్నేహితుడితో కలిసి హాస్టల్ నుంచి సమీపంలోని చలి వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్...