భారతదేశం, మార్చి 15 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఆడ పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలోని అన్నారం క్రాస్ బీరసాగర్ పోచమ్మ ఆలయం వద్ద రెండు రోజుల కిందట కొంతమంది వాహనదారులు పులిని చూసినట్టు చెబుతున్నారు. అటుగా వచ్చిన పులిని గమనించి, గ్రామస్థులకు సమాచారం చేరవేయగా.. ఆ విషయం కాస్త వైరల్ అయ్యింది.

గ్రామస్థులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. పులి జాడను కనుగొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా పులి పాద ముద్రలను గుర్తించారు. మహదేవపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది ఆడ పులిగా భావిస్తున్నారు. పులిని గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు....