భారతదేశం, ఏప్రిల్ 13 -- Bhu Bharathi : సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచే భూ భారతి వెబ్‌సైట్‌ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని అధికారులకు సూచించారు. జూబ్లీ హిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భూ భారతి పథకంపై ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ భారతి వెబ్‌సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా రూపొందించాలని సూచించారు.

రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందించేందుకు రూపొందిన భూ భారతి పోర్టల్‌ను ఏప్రిల్ 14(సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పర...