భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండుగను అందరూ బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణ రాష్ట్రాల్లో కూడా మకర సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. మకర సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను, మకర సంక్రాంతి తర్వాత రోజును కనుమ పండుగగా జరుపుకుంటాము.

భోగి రోజున పిల్లలకు భోగి పళ్లను పోయడం, సాయంత్రం బొమ్మల కొలువు పెట్టడం, ఉదయాన్నే మంటలు వేయడం ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే, భోగి నాడు ఎందుకు భోగి మంటలు వేయాలి? దాని వెనుక కారణం ఏమిటి? భోగి పండుగను ఎందుకు జరుపుకోవాలి? భోగి మంటల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఇలా అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రీయ కారణాల ప్రకారం చూసినట్లయిత...