Hyderabad, ఫిబ్రవరి 16 -- చిన్నతనంలోనో, వయస్సులో కాస్త పెద్దయ్యాకనో మనం ఎదుర్కొనే సంఘటనల నుంచి చేదు నిజాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనతో ఒకేలా ప్రవర్తించడం లేదని, మనలో ఉన్న మంచితనాన్ని బలహీనతగా తీసుకొంటున్నారని తెలుస్తుంది. చాలా సులువుగా వాళ్లు చేయగలరనే ఫీలింగ్ తో మనల్ని హర్ట్ చేసేస్తుంటారు. అయినప్పటికీ వారితో మంచిగానే ప్రవర్తించాలా? మన మొఖం మీదనే తిట్టిపోసిన వారికి మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలా? మన మీద జాలి చూపించని వారిపట్ల దయ చూపించాలా? ఈ ప్రశ్నలన్నింటికీ భగవద్గీత ఏం సమాధానం చెప్తుందంటే..

కదనరంగంలో అర్జునుడు నిలబడినప్పుడు సందిగ్ధంలో ఉండిపోయాడు. ఆ సందర్భంలో కృష్ణుడు ఇతరులు నీతో ప్రవర్తించినట్లు నువ్వు వ్యవహరించకు. నీ సొంత ధర్మాన్ని నువ్వు పాటించమని ఉపదేశించాడు. దీనిని బట్టి మంచితనం అనేది ప్రపంచానికి నువ్వు చూపి...