భారతదేశం, మార్చి 17 -- Bhadradri Lord Rama Talambralu : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను భ‌క్తుల ఇళ్లకు నేరుగా చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను హోండెలివ‌రీ చేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.

రాములోరి త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు వెబ్‌సైట్ http://tgsrtclogistics.co.inలో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు ఆర్టీసీ హోండెలివరీ చేస్తుంది.

ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు....భద్రాచలం సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ను...