భారతదేశం, ఏప్రిల్ 6 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సారపాక గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో రేవంత్ భోజనం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో లబ్ధిదారు ఇంట్లో భోజనం చేశారు.

సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను అడిగారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని తులసమ్మ సీఎంకు చెప్పారు. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.

200 యూనిట్స్ ఉచిత కరెంట్, ...