ఖమ్మం,తెలంగాణ, జనవరి 31 -- భద్రాచలం ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ, అనేక మంది అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా తాజాగా బాధ్యతాయుత వృత్తిలో కొనసాగుతున్న పాత్రికేయులే గంజాయి తరలిస్తూ, పట్టుబడటం తీవ్ర సంచలనం సృష్టించింది.

హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ అధికారులు భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనీఖీ చేసే క్రమంలో అక్కడికి చేరుకున్న హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 ఆస్టా(నంబర్: AP37 BU 5216) కారును తనిఖీ చేశారు. ఆ కారులో ఉన్న 81.950 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.

గంజాయి తరలిస్తున్న ఆ కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకుని విచారించిన నార్కోటిక్స్ అధికారులు వారి వివరాలు రాబట్టారు. వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్...