భారతదేశం, మార్చి 26 -- Bhadrachalam Temple : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం ఇక నూతన శోభను సంతరించుకోనుంది. అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఈ దేవాలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచేందుకు అడుగులు పడుతున్నాయి. వచ్చే నెలలో శ్రీ రామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి పూనుకుంది. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భద్రాద్రి ఆలయ భూ సేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూ సేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మలను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ. 34 కోట్ల నిధులను విడుదల చేస్...