భారతదేశం, మార్చి 28 -- తెలుగు రాష్ట్రాల ప్రజలకు భద్రాద్రి రామయ్య ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. శ్రీరామనవమి కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపే ఏర్పాట్లు చేశారు. తలంబ్రాల కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బుక్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలను పంపిస్తామని ఈవో రమాదేవి వివరించారు. ముత్యాల తలంబ్రాల ధర ఒక ప్యాకెట్‌కు రూ.60 ఉంటుంది. తలంబ్రాలు బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తారు.

ముత్యాల తలంబ్రాలను https://bhadradritemple.telangana.gov.in/mt_bookings/?ssid=153 లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. పోస్టల్, ఆర్టీసీ కార్గోల కోసం వేర్వేరు బుకింగ్స్ ఉంటాయి. ఇటు ఆర్టీసీ, అటు పోస్టల్ శాఖలతో ఆలయ అధికారులు సమన్వయం చేసుకొని.. తలంబ్రాలను ఇంటికి పంపిస్తారు.

పై లింక్ ఓపెన్ చేసిన తర్వాత.. ఆలయ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్,...