తెలంగాణ,భద్రాచలం, ఏప్రిల్ 14 -- Bhadrachalam Kalyanam 2024: దక్షిణ భారతదేశ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఆ సీతారాములు నడయాడిన చారిత్రిక నేపథ్యం కలిగిన ప్రాంతంలో నిర్మితమైన దేవాలయం కావడంతో ఇక్కడ జరిపే శ్రీరామ కల్యాణానికి విశిష్టత నెలకొంది. తెలంగాణలో ప్రాముఖ్యం కలిగిన దేవాలయాల్లో భద్రాద్రి రామాలయం మొదటిది కావడంతో ప్రతియేటా ఇక్కడ జరిగే కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 17వ తేదీన వైభవంగా జరిగే ఉత్సవానికి ఇప్పటికే గోటి తలంబ్రాలు సిద్ధమవుతుండగా భక్తుల వీక్షణకు కావాల్సిన దర్శన టిక్కెట్లను ఆలయ నిర్వాహకులు నేటి నుంచి అందుబాటులోకి తెచ్చారు.

సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని(Bhadrachalam Kalyanam) దగ్గరి నుంచి వీక్షించాలని కోరుక...