భారతదేశం, ఏప్రిల్ 24 -- BHA shoe size system:త్వరలో భారతీయుల కోసం ప్రత్యేకమైన పాదరక్షల సైజింగ్ విధానం అందుబాటులోకి రానుంది. భారత్ లోని వివిధ వయస్సుల వ్యక్తులకు మరింత సౌకర్యవంతమైన పాదరక్షలను రూపొందించడానికి వ్యక్తుల పాదం పొడవును మాత్రమే కాకుండా వెడల్పును కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విధానాన్ని (BHA shoe size system) రూపొందించారు.

డిసెంబర్ 2021 లో, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) తో కలిసి భారతీయుల అవసరాలను ప్రత్యేకంగా తీర్చే 'ఇండియన్ ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్' ను అభివృద్ధి చేసింది. ఇటీవల ఈ వ్యవస్థ సమర్థతను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆమోదం కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కు నివేదిక సమర్పించారు.

భారత పాదరక్షల తయారీ వ్యవస...