భారతదేశం, మార్చి 7 -- Bezawada BRTS: బెజవాడలో బీఆర్‌టీఎస్‌... పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వ హయంలో విజయవాడ, విశాఖ నగరాలకు 2008లో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు. 17ఏళ్లు గడిచినా ఇది పట్టాలెక్కలేదు. ఆ పేరుతో వందల కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. మరోవైపు బెజవాడలో బీఆర్‌టిఎస్‌ పేరుతో నిర్మించిన రోడ్డు మాత్రం ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేసుకోడానికి అడ్డాగా మారింది.ఫుడ్‌ కోర్టుల పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకోవడంలో స్థానిక నేతలు సక్సెస్ అయ్యారు.

బెజవాడలో బీఆర్‌‌టీఎస్‌ ప్రాజెక్టు 2008లో ఊపిరి పోసుకుంది. అప్పటికే హైదరాబాద్‌ నగరానికి మెట్రో మంజూరైంది. హైదరాబాద్‌‌తో పాటు ఏపీలో నగరాలను కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. నగరంలో ప్రత్యేక కారిడార్‌లను ఏర్పాటు చేసి లో ఫ్లోర్‌ బస్సుల్ని ఆ కారిడార్లలో న...