Hyderabad, మార్చి 18 -- భోజనం చేసిన వెంటనే తమలపాకులను నమలడం మన పురాతన ఆహారపు అలవాట్లలో ఉండేది. విందుల్లో స్వీట్ పాన్ ను కచ్చితంగా ఇస్తారు. తమలపాకును నమలడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం తరువాత రెండు తమలపాకులను శుభ్రంగా కడిగి నోట్లో పెట్టి నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉండండి. అందులో ఎలాంటి పదార్థాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది సున్నం, వక్క వంటివి పెట్టుకుంటారు. అవి పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం తమలపాకులే ప్రతిరోజూ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి.

జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని ఉత్తేజపరుస్తుంది. తద్వారా ఇది జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది., మరియు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి కూడా మంచిది. భోజనం చేసిన వెంటనే ఇది జీర్ణక్రియను ఉత్తేజపరిచే సహజ ఏజెంట్.

తమలపా...