భారతదేశం, ఏప్రిల్ 13 -- Betala swamy Jatara : నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అరుదైన బేతాళ స్వామి ఆలయ జాతరకు సర్వం సిద్ధం అయ్యింది. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండల కేంద్రంలో నిర్మించిన బేతాళ స్వామి దేవాలయం ఉత్సవాలు, మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఉత్సవాల తర్వాత అతి పెద్ద జాతరగా భావిస్తారు. గ్రామస్తుల కథనం ప్రకారం, 400 సంవత్సరాల క్రితం గ్రామంలోని ప్రజలు తీవ్ర రోగాల బారిన పడడంతో, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అక్కడి పాలకుడు, భూత, ప్రేత, పిశాచలకు అధిపతిగా భావించే బేతాళ స్వామికి గుడి కట్టించారు. గుడి కట్టిన తర్వాత, ప్రజలందరికీ రోగాలు తగ్గిపోవడంతో, బేతాళ స్వామికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టారు.

ఇలా ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఏడు రోజులు గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. సోమవారం రోజు, గ్రామా దేవత పోలేరమ్మకు బోనాలు అర్పించడం...