Hyderabad, ఫిబ్రవరి 25 -- కొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా పరీక్షలకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. ఆహారం నిద్ర విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇక నుంచి ప్రతిరోజూ విద్యార్థులకు చాలా ముఖ్యమైన రోజులు కనుక చదువుకునే విద్యార్థుల మనసులో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతాయి.

పరీక్షలు బాగా రాయాలంటే ఎలా చదవాలి, ఏమేం చదవాలి అనేవి సందేహాలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహాయం చేస్తుంటారు. వారు సూచించిన విధ్యంగా చదువుకుంటే సరిపోతుంది. కానీ విద్యార్థుల్ల మెదడులో తలెత్తే మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలేంటంటే పరీక్షల కోసం చదువుకోవడానికి సరైన సమయం ఏంటి?, ఏ సమయంలో మెదడు మరింత చురుగ్గా పనిచేసి చదివినవాటన్నింటినీ స్పష్టంగా గుర...