Hyderabad, ఏప్రిల్ 8 -- Best Thrillers on Jiohotstar: థ్రిల్లర్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో మంచి ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలుసు కదా. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జియోహాట్‌స్టార్ లోనూ ఇలాంటి థ్రిల్లర్స్ చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏవో తెలుసుకోండి.

మలయాళం మూవీ కిష్కింధ కాండం గతేడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటి. ఆసిఫ్ అలీ నటించిన ఈ సినిమా ఓ మిస్సయిన గన్ చుట్టూ తిరుగుతుంది. అయితే గన్ మిస్ కావడం కాదు.. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఈ మూవీలో అసలు ట్విస్ట్. తెలుగులోనూ ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.

ఓ ఊళ్లో వరుస చావులు, దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకునే ఓ పోలీస్ అధికారి చుట్టూ తిరిగే కథే ఈ మంగళవారం. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించింది. జియోహాట్‌స్టార్ లో ...