భారతదేశం, జనవరి 23 -- భారతదేశంలో కార్ల అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 33.21 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. అంతకన్నా ముందు ఏడాది ఇదే సమయంతో (30.09 లక్షలు) పోలిస్తే ఇది 10.35 శాతం పెరుగుదల. భారతీయుల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా, కార్ల పట్ల వారికున్న ఆసక్తి కూడా రెట్టింపు అయ్యిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో బెస్ట్​ సెల్లింగ్​, టాప్​-10 కార్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

1. మారుతీ సుజుకీ డిజైర్.. తిరుగులేని విజేత

ఇండియాలో సెడాన్ కార్లంటే క్రేజ్ తగ్గలేదని మారుతీ సుజుకీ డిజైర్ నిరూపించింది. 2,14,488 యూనిట్ల అమ్మకాలతో 2025లో ఇది నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 2024లో ఎనిమిదో స్థానంలో ఉన్న డిజైర్, ఏకంగా 28 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇందులో సీ...