భారతదేశం, మార్చి 5 -- ఇటీవలి కాలంలో బైక్ తప్పనిసరి అయిపోయింది. అయితే కచ్చితంగా మైలేజీ ఇచ్చే బైకులను తీసుకునేందుకే జనాలు ఇష్టపడుతారు. గ్రామీణ, పట్టణ నివాసితులకు రోజువారీ ఉపయోగం కోసం బైక్స్ అనివార్యమయ్యాయి. హీరో స్ప్లెండర్, హోండా షైన్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ పల్సర్ 125 మోటార్ సైకిళ్ళ వైపు జనాలు ఆసక్తిగా ఉన్నారు. ఇవి ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో వస్తాయి. పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ బైక్‌ల ధర, స్పెసిఫికేషన్ల గురించి వివరాలు చూద్దాం..

స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోడల్ ధర రూ. 80,161 నుంచి రూ. 83,461 మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంటుంది. 97.2సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సూపర్ స్ప్లెండర్ మోడల్ ధర రూ. 82,298 నుండి రూ. 86,298 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 12...