భారతదేశం, ఫిబ్రవరి 2 -- శాంసంగ్​ గెలాక్సీ ఎస్​25 లాంచ్​తో ప్రీమియం స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరిగింది! ఈ సెగ్మెంట్​లో ఐఫోన్​ 16కి ఇప్పటికే మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్​? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్​ఫోన్​ 12 జీబీ ర్యామ్- 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రారంభ ధర రూ .80999గా ఉంది. ఇక ఐఫోన్​ 16 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,990.

గెలాక్సీ ఎస్ 25, ఐఫోన్ 16 చాలా విభిన్నమైన డిజైన్ ప్రొఫైల్స్​ని కలిగి ఉన్నాయి. ఈసారి శాంసంగ్ కొన్ని ప్రధాన డిజైన్ మార్పులు చేసింది. ఇది స్మర్ట్​ఫోన్​ని దాని మునుపటి జనరేషన్​ కంటే మరింత తేలికగా చేసింది. మరోవైపు, ఐఫోన్16లో నిలువుగా అమర్చిన కెమెరాలు, కొత్త కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్​ వంటివి ...