Hyderabad, మార్చి 13 -- Best Malayalam Court Room Dramas: ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే థ్రిల్లర్స్ ను తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ప్రతి సీన్ రక్తికట్టించేలా ఉండే కోర్టు రూమ్ డ్రామాస్ కు మలయాళంలో కొదవ లేదు.

మరి ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆ సినిమాలేంటి? వాటిలో బెస్ట్ మూవీస్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీటిలో మోహన్ లాల్ నటించిన నేరు, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన జనగణమన మాత్రం మిస్ కావద్దు.

దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కలిసి ఈ ఆసక్తికరమైన కోర్టు డ్రామాని తీసుకొచ్చారు. ఇందులో ఒక అంధురాలైన అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం కోసం పోరాడుతారు. అనస్వరా రాజన్ ఈ మూవీలో సారాగా నటించింది. ఆమె ఎన్ని కష్టాలు ఎదురైనా, న్యాయం కోసం గొంతెత్తుతుంది.

అ...