భారతదేశం, డిసెంబర్ 6 -- సొంతింటితో పాటు సొంతంగా ఒక కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది భారతీయులకు ఉండే ఒక కోరిక! ఇందుకోసం రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ, ఏదో ఒక రోజు సొంతంగా కారు కొనాలని ప్లాన్​ చేస్తుంటారు. అయితే 4 వీలర్​ కొనాలంటే ఇప్పుడు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! తక్కువ ధరకే మంచి మోడల్స్​ అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ బడ్జెట్​లో కారు కొనుగోలు చేయాలని ప్లాన్​ చేస్తుంటే ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దేశంలో రూ. 5లక్షల (ఎక్స్​షోరూం) కన్నా తక్కువ ధరకు లభిస్తున్న కొన్ని బెస్ట్​ ఆప్షన్స్​ని ఇక్కడ తెలుసుకుందాము..

టాటా టియాగో: 2025లో మోస్ట్​ ఆఫార్డిబుల్​ కార్లలో ఈ టాటా టియాగో ఒకటి. బిల్డ్​ క్వాలిటీకి, సేఫ్టీకి టియాగో పెట్టింది పేరు! టాటా టియాగో ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 4.57లక్షలు.

ఇందులో 1199 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 74.41 హెచ్​పీ...