భారతదేశం, ఫిబ్రవరి 13 -- కెమెరా బాగుంటుదని స్మార్ట్ ఫోన్ కొనేవారు కూడా చాలా మందే ఉన్నారు. మీ బడ్జెట్ కూడా రూ.12 వేలలోపుఅయితే మీ కోసం మంచి కెమెరా ఫోన్స్ ఉన్నాయి. ఈ 3 స్మార్ట్‌ఫోన్లలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. ఈ జాబితాలో రెడ్‌మీ, పోకో ఫోన్లు ఉన్నాయి. ఈ బెస్ట్ కెమెరా ఫోన్లలో 108 మెగాపిక్సెల్ వరకు కెమెరా, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 16 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. రూ.11,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్‌తో రెడ్‌మీ 13 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.11,849 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత రూ.10,849కే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ...