భారతదేశం, అక్టోబర్ 5 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ ఒకే ధరల విభాగంలో ఉన్నప్పటికీ, అవి వేర్వేరు వ్యక్తిత్వాలున్న రైడర్‌లను ఆకర్షిస్తాయి. హంటర్ 350 అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బ్రాండ్‌ను స్థాపించిన హెరిటేజ్​, మినిమలిస్ట్ అనుభూతిని అందిస్తుంది. మరోవైపు, టీవీఎస్ రోనిన్ మాత్రం అధునాతన సాంకేతికతతో కూడిన నియో-రెట్రో డిజైన్‌ను మిళితం చేస్తూ, సరికొత్త మార్గంలో పయనిస్తుంది.

ఈ రెండు బైక్‌లు కూడా సులభంగా నడపగలిగే, స్టైలిష్‌గా ఉండే, రోజువారీ అవసరాలకు సరిపోయే బైక్‌ను కోరుకునే నగర రైడర్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది కొనొచ్చు? ఇక్కడ తెలుసుకోండి..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో వేరియంట్‌ ధర రూ. 1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద మొదలవుతుంది. టాప్ వేరియంట్ అయిన మెట్రో రెబెల్ ట్రిమ్ ధర సుమారుగా రూ. 1.67 లక్షల వరకు ఉంటుంది. క...