భారతదేశం, జనవరి 2 -- దిల్లీ, ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్ చాలా సాధారణం. అయితే ట్రాఫిక్ జామ్ పరంగా ఆసియాలోని టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు కూడా ఉంది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 ప్రకారం, బెంగుళూరు ట్రాఫిక్ పరంగా ఆసియాలోని అత్యంత అధ్వాన్నమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ పీక్ అవర్స్‌లో కేవలం 10 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 28 నిమిషాల 10 సెకన్లు పడుతుంది. అంటే ఇక్కడ నివసించే ప్రజలు రద్దీ సమయాల్లో ఏటా దాదాపు 132 అదనపు గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతారు.

బెంగళూరులో రద్దీ పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. బెంగళూరు నగరంలో జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు పట్టణ మౌలిక సదుపాయాలు, సిటీ విస్తరిస్తోంది. చాలా ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. దక్షిణ, ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల జనాలు బెంగళూరులో బతుకుతుంటారు. ఈ సిటీలో ట్రాఫిక్ నిర...