భారతదేశం, మార్చి 22 -- Bengaluru rains: శనివారం ఉదయం నుంచి బెంగళూరు నగరంలో వాతావరణం చల్లబడింది. వర్షం ప్రారంభమైంది. ఇన్నాళ్లూ మండే ఎండలతో ఇబ్బంది పడిన బెంగళూరు వాసులు ఈ మారిన వాతావరణంతో కాస్త చల్లబడ్డారు. ఊపిరి పీల్చుకున్నారు. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవడంతో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించింది.

అయితే, ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన వర్షం కాసేపట్లో భారీ వర్షంగా మారింది. ఉరుములు, మెరుపులు, వడగళ్లతో బీభత్సం సృష్టించింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బెంగళూరు రూరల్ జిల్లా హోసకోటేలో వడగళ్ల వానలు పడిన వీడియోను ఎక్స్ యూజర్ షేర్ చేశాడు. ఈదురుగాలులతో పాటు బెంగళూరు నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే 2-3 రోజుల్లో నగరం అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 22, 23 తేదీల్ల...