భారతదేశం, ఏప్రిల్ 3 -- Bengaluru rain: గురువారం 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి బెంగళూరులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తవరెకెరె మెయిన్ రోడ్ అత్యంత ప్రభావితమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ నివాసితులు మోకాలి లోతు నీటిలో నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూపించాయి. ఇది నగరంలో కుప్పకూలుతున్న మౌలిక సదుపాయాలపై ఆందోళనలను రేకెత్తించింది.

బీటీఎం లేఅవుట్ వాసులు నీట మునిగిన వీధుల దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు. ''తావరెకెరె మెయిన్ రోడ్డులో కేవలం 30 నిమిషాల వర్షం మాత్రమే. ఇక్కడ పరిస్థితి ఇది. పన్ను కట్టిన మా డబ్బు ఎటు వెల్లింది..? అని నగర నాయకులు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ ఓ యూజర్ పోస్ట్ పెట్టారు.

డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడంలో ప్రభుత్వం విఫలమైందని పౌరులు విమర్శలు గుప...