భారతదేశం, ఏప్రిల్ 5 -- Bengaluru techie murder: ఓ టెక్కీ తన భార్యను హత్య చేసి సూట్కేసులో కుక్కిన హత్య కేసులో బెంగళూరు పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రాకేష్ ఖేడేకర్ తన భార్య గౌరీ సాంబేకర్ ను హులిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లి నివాసంలో కత్తితో పొడిచి చంపి, ఆమె మృతదేహాన్ని సూట్ కేస్ లో కుక్కి, నగరం విడిచి పారిపోయాడు.

పోలీసులకు రాకేశ్ ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాల ప్రకారం.. ఈ జంట ఇటీవలే ముంబై నుంచి బెంగళూరుకు వచ్చారు. వీరిది ప్రేమ వివాహం. స్కూల్ రోజుల నుంచి వీరి మధ్య పరిచయం ఉంది. రాకేశ్ బెంగళూరులోని ఒక కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తుండగా, ఆయన భార్య గౌరి ఉద్యోగ వేటలో ఉంది. హత్య జరిగిన రోజు సాయంత్రం ఆ జంట ఉల్లాసంగా గడిపారు. సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వ...