భారతదేశం, మార్చి 1 -- Bengaluru explosion: రామేశ్వరం కెఫే పేలుడు (Bengaluru explosion)కు తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థం కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు. బెంగళూరు నడిబొడ్డున ఉన్న ప్రముఖ కెఫే లో జరిగిన పేలుడు భారత ఐటీ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పేలుడు పదార్ధాన్ని ఓ కస్టమర్ బ్యాగులో ఉంచి, ఆ కెఫేలో పెట్టి వెళ్లినట్లు సిద్దరామయ్య ధృవీకరించారు.

మైసూరులో సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం తర్వాత రామేశ్వరం కెఫే లో ఎవరో బ్యాగ్ ఉంచారని, అది పేలి కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. ''సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. అది బాంబు పేలుడే. ఎవరు చేశారో తెలియదు. పరిస్థితిని సమీక్షించాలని హోంమంత్రిని ఆదేశించాను' అని సిద్ధరామయ్య తెలిపారు. ఇది స్వల్ప తీవ్రత కలిగిన పేలుడు అన...