భారతదేశం, ఏప్రిల్ 15 -- Bengaluru airport: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) తన డిజిటల్ డిస్ ప్లే బోర్డుల నుంచి హిందీని తొలగించిందని, కన్నడ, ఇంగ్లిష్ భాషలను మాత్రమే చూపుతోందని పేర్కొంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో, విమానాశ్రయ అధికారులు వివరణ ఇచ్చారు. సాధారణంగా విమాన నంబర్లు, గమ్యస్థానాలు, స్టేటస్, గేట్ నంబర్లను డిస్ ప్లే బోర్డ్ ల్లో చూపుతారు.

విమానాశ్రయంలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్ లో ఎలాంటి మార్పు లేదని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) ధృవీకరించింది. 'మా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్ లో ఎలాంటి మార్పు లేదు. ప్రయాణీకులకు సహాయపడటానికి డిస్ప్లేలలో ఇంగ్లీష్, కన్నడ ఉన్నాయి. అదనంగా, టెర్మినల్స్ అంతటా ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషల్లో సైనేజీలను ప్రదర్శిస్తున...