Hyderabad, ఫిబ్రవరి 12 -- బెండకాయ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో ఒకటి. దీంతో ఎప్పుడూ బెండకాయ పులుసు లేదా సాంబార్లో బెండకాయ ముక్కలు వేయడం, బెండకాయ ఫ్రై వంటివే చేస్తారు. ఒక్కసారి మేము చెప్పిన పద్ధతిలో బెండకాయ పచ్చడి చేసుకొని చూడండి... ఎంత అద్భుతంగా ఉంటుందో. బెండకాయ జిగటగా ఉంటుంది కదా అనుకోవచ్చు. పచ్చడి మాత్రం అద్భుతంగా వస్తుంది. అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బెండకాయలు - పావు కిలో

టమోటోలు - రెండు

నూనె - రెండు స్పూన్లు

మెంతులు - పావు స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

ధనియాలు - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - అయిదు

ఎండుమిర్చి - పది

కొత్తిమీర - గుప్పెడు

కరివేపాకులు - గుప్పెడు

చింతపండు - ఉసిరికాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - చిటికెడు

పచ్చి శెనగపప్పు...