Hyderabad, ఫిబ్రవరి 9 -- వేలాడే పొట్ట ఇప్పుడు చాలా మందిలో సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి కారణంగానో లేక తినే ఆహారాల కారణంగానో ప్రసవం అయిన మహిళలు మాత్రమే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తమ పొట్ట కండరాలను బిగుతుగా చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. వేలాడే పొట్టను తగ్గించుకోవడానికి డైటింగ్, వాకింగ్ తో పాటు కొన్ని క్రంచెస్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం పొందలేకపోతున్నారు. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీ పొట్ట కండరాలను బిగుతుగా చేసుకుని, వేలాడే పొట్టను తగ్గించుకోవాలనుకుంటే, క్రంచెస్ కాదు ఈ 5 రకాల వ్యాయామాలను రోజువారీ కార్యక్రమంలో చేర్చుకోవాలంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.

పొట్ట కండరాలను బిగుతుగా చేయడంలో ఫటర్ మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు యోగా మ్యాట్ మీద వెళ...