Hyderabad, మార్చి 31 -- వంకాయ మసాలా కర్రీ, దొండకాయ మసాలా కర్రీ వంటివి చాలామంది చేస్తూ ఉంటారు. కానీ బీరకాయలతో మసాలా కర్రీ ఎవరూ చేయరు. దాన్ని రోగుల కోసం వండే కూరలాగా చూస్తారు. పథ్యంలో అధికంగా బీరకాయనే పెడుతూ ఉంటారు. నిజానికి బీరకాయను కూడా టేస్టీగా మసాలా పెట్టి వండొచ్చు. బీరకాయ మసాలా కర్రీ ఒక్కసారి తిన్నారంటే దాని రుచి మీరు మర్చిపోలేరు. వారంలో ఒక్కసారైనా తినాలనిపిస్తుంది. దొండకాయ మసాలా, వంకాయ మసాలా అలాగే బీరకాయ మసాలా కర్రీ కూడా అద్భుతంగా ఉంటుంది. అతిధులకు వడ్డిస్తే కచ్చితంగా వారికి నచ్చుతుంది. ఇక బీరకాయ మసాలా కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బీరకాయలు - మూడు

నువ్వులు - రెండు స్పూన్లు

పల్లీలు - ఒక కప్పు

కొబ్బరి తురుము - పావు కప్పు

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

కరివేపాకు రెబ్బలు - గుప్పెడు

నూనె - నాలుగు స్ప...