Hyderabad, ఫిబ్రవరి 26 -- పచ్చి పాలు ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఆ పాలను మరగబెట్టి టీ లేదా కాఫీ చేసుకున్నకే ఎవరైనా తమ రోజును ప్రారంభిస్తారు. కేవలం తాగడానికి మాత్రమే కాదు అందాన్ని పెంచుకోవడానికి కూడా పాలను ఉపయోగించవచ్చు. కాచి చల్లార్చిన పాలకంటే పచ్చిపాలు చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పచ్చి పాలను ప్రతిరోజు ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.

పచ్చిపాలు అంటే గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలు. ఆ పాలను నేరుగా ముఖానికి రాయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. బయట దొరికే పాల ప్యాకెట్లలో ఉండే పాలు... పచ్చిపాలు అనుకుంటారు ఎంతోమంది. కానీ అవి పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురైన తర్వాతే ఆ ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. కాబట్టి అవి పచ్చి పాల జాబితాలోకి రావు. పచ్చిపాలు ముఖానికి రాయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

న...