Hyderabad, ఫిబ్రవరి 14 -- వృద్ధాప్యం రాకముందే ముసలివారిగా కనిపించాలని ఎవ్వరూ కోరుకోరు. అలాగే ఒకవేళ వృద్ధాప్యం వచ్చినా ఆ ఛాయలు కనిపించకుండా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. అందుకే మార్కెట్లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులకు అంత డిమాండ్. మీరెన్ని స్కిన్ కేర్ ప్రొడక్టులు వినియోగించినా, ఎంత అందంగా ఉండాలని ప్రయత్నించినా ఆహారంలో మార్పులు తీసుకోకుంటే అది సాధ్యపడదు. చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా, ముడతలు లేకుండా ఉంచుకోవడానికి ప్రత్యేక సంరక్షణ తీసుకోవాలి. చర్మంపై అదే మెరుపు కొనసాగడానికి మీ ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోండి. వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదించే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఆహారంలో పోషకాలతో నిండిన, రుచికరమైన దానిమ్మను చేర్చుకోండి. ఇది మీ ఆరోగ్యానికే కాకుండా అందానికి చాలా మేలు కలుగజేస్తుంది. దానిమ్మలో పాలీఫినోల్స్, విటమిన్ సి పుష్కలంగా ...