భారతదేశం, ఫిబ్రవరి 11 -- ముఖ కాంతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కారణాల వల్ల వయసు పెరగక ముందే చర్మం వాడిపోయినట్టు అయిపోతోంది. చర్మాన్ని కాపాడుకోవడానికి స్కిన్ కేర్ రొటీన్‌తో పాటు శరీరంలోని కొల్లాజెన్ స్థాయిలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ లోపం వల్ల చర్మం వదులుగా మారడం, ముడతలు పడటం, కీళ్ళ నొప్పులు, బలహీనమైన కండరాలు, ఎల్లప్పుడూ అలసటగా ఉండడం, చర్మం ఎరుపుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. చాలామంది వయసు ముదరక ముందే సంబంధించిన ముఖ కాంతి కోల్పోవడాన్ని గురించి చెబుతుంటారు. దీనికి కారణం రోజువారీ ఆహారపు అలవాట్లు కావచ్చు. శరీరంలో కొల్లాజెన్ స్థాయిని మెరుగుపరచడానికి మీరు ఏమి తినాలో? ఏమి తినకూడదో తెలుసుకోండి.

కొల్లాజెన్ అనేది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ప్రోటీన్. ఇది ఎముకలను బలంగా, చర్మాన్ని అందంగా, జుట్టున...