భారతదేశం, ఫిబ్రవరి 16 -- Beauty Teaser: అంకిత్ కొయ్య హీరోగా న‌టిస్తోన్న బ్యూటీ మూవీ టీజ‌ర్ రిలీజైంది. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ నీల‌ఖి పాత్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేసిన బ్యూటీ టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అందమైన ప్రేమ కథతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను టీజ‌ర్‌లో చూపించారు. స్కూటీ కార‌ణంగా హీరోహీరోయిన్ల మ‌ధ్య ప్రేమ ఏర్ప‌డ‌టం, మాట‌లు లేకుండా కేవ‌లం చూపుల‌తోనే భావాల‌ను వ్య‌క్త‌ప‌రుచుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది.

టీజర్ చూస్తుంటే ఓ స్కూటీ చుట్టూనే బ్యూటీ కథ తిరిగేలా ఉంది. స్కూటీ వచ్చాకా? ఏం జరుగుతుంది? అసలు హీరోయిన్ స్కూటీ కొన‌మ‌ని తండ్రిని ఎందుకు అడుగుతోంది..? ఆ స్కూటీ వచ్చాక హీరోయిన్‌లో వచ్చే మార్పులు ఏంటి? అంటూ టీజ‌ర్‌లో చూపించిన ప్ర‌శ్న‌లు మూవ...