Hyderabad, ఏప్రిల్ 9 -- మృణాల్ ఠాకూర్ అందానికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన బ్యూటీ సీక్రెట్స్ పంచుకున్నారు. ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అందాన్ని కాపాడుకోవచ్చని ఆమె చెప్పారు. తన జుట్టును, చర్మాన్ని ఎలా మెరిపించుకుంటారో కూడా వివరించింది.

మీరు మీ జుట్టు మందంగా మరియు బలంగా ఉండాలనుకుంటే, మీ ముఖంపై మెరుపును చూడాలనుకుంటే మృణాల్ ఇక్కడ చెప్పిన బ్యూటీ టిప్స్ ను ఫాలో అవ్వండి. వీటికి పెద్దగా ఖర్చు కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో అయిపోవచ్చు.

బాదం నూనె మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ బాదం నూనెను వాడాలి. దీని వల్ల చర్మంలో హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. బాదం నూనెలో కనిపించే లినోలెయిక్ ఆమ్లం చర్మ అవరోధాన్ని పెంచుత...