భారతదేశం, డిసెంబర్ 28 -- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 80 పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు దగ్గరపడింది.

అర్హులైన అభ్యర్థులు రేపటి లోపు (డిసెంబర్ 29) అప్లయ్ చేసుకోవచ్చు. అది కూడా సాయంత్రం 4 గంటలలోపు వరకే ఛాన్స్ ఉంటుంది. https://online.cbexams.com/ లింక్ తో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మొత్తం 9 విభాగాల్లో 80 ఖాళీలుండగా. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. నెలకు రూ.40,000 - రూ.1,40,000 జీతం చెల్లిస్తారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....