భారతదేశం, నవంబర్ 29 -- BCCI Future Plan in T20Is: ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిదే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జట్టు కూర్పుపై అసంతృప్తి వ్యక్తమయ్యాయి. ఈ ఓటమితో సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్, విరాట్ కోహ్లీ తదితరులను టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు కోచ్ ద్రవిడ్ సైతం ఇప్పుడే చెబితే తొందరపాటే అవుతుందని సమాధానమిచ్చారు. అయితే తాజా నివేదికలను చూస్తుంటే త్వరలోనే రోహిత్ శర్మ, విరాట్, అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి.

బీసీసీఐ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 2024 టీ20 ప్రపంచకప్ సమయానికి సరికొత్త జట్టును సిద్ధం చేసేందుకు ప్రణాళిక...